‘నితిన్’ ప్లాప్ సినిమా హిందీలో సంచలనాలను సృష్టిస్తోంది !
Published on Jun 13, 2018 1:00 pm IST

హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్‌, అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘లై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం థియేటర్స్ లో ప్లాప్ అయినా యూట్యూబ్ లో మాత్రం సంచలనాలలు సృష్టిస్తోంది. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెలుగు అనువాదమైన చిత్రాలకు హిందీ యూట్యూబ్‌ చానల్స్ లో బాగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ‘ఆర్కే దుగ్గల్‌ స్టూడియోస్‌’ అనే హిందీ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ ‘లై’ చిత్రాన్ని విడుదల చేశారు. గత ఏడాది విడుదలైన ఈ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ దగ్గరదగ్గరిగా దాదాపు ‘అయిదు కోట్ల ఇరవై మూడు లక్షల’కి పైగా వ్యూస్‌, లక్షా ఎనభై ఒక్క వేలకి పైగా లైక్స్‌ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం వ్యూస్‌ రోజు రోజుకి పెరుగుతున్నాయి. హిందీ ప్రేక్షకులను ‘లై’ చిత్రం బాగా అలరిస్తుంది. నిజంగా తెలుగు సినీపరిశ్రమకు ఇది చాలా శుభ పరిణామం. దీని వలన తెలుగు సినిమాలకు అనువాద హక్కుల రూపంలో భారీ ఆదాయం వస్తుంది. ఇకపోతే ‘అల్లు అర్జున్’ చిత్రాలు ‘డీజే’ 161 మిల్లియన్స్ వ్యూస్ ను సొంతం చేసుకుంటే, ‘సరైనోడు’ చిత్రం ఏకంగా 180 మిల్లియన్స్ వ్యూస్ ను సాధించి తెలుగు అనువాద చిత్రాల్లోనే రికార్డ్స్ సృష్టించింది.

 
Like us on Facebook