“లైగర్” క్లైమాక్స్ వెరీ ఎమోషనల్ గా.. !

Published on Apr 11, 2021 10:47 am IST

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న “లైగర్” సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాలో కీలకమైన క్లైమాక్స్ పార్ట్ ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారట . సినిమాలోనే కీలకమైన ఈ పార్ట్ వెరీ ఎమోషనల్ గా.. పవర్ ఫుల్ యాక్షన్ తో సాగుతుందట. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు.

కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :