యువ దర్శకుడితో బాలయ్య సినిమా ఒకే అయినట్టే ?

Published on Apr 21, 2021 1:30 am IST

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల కాంబినేషన్ చాలా రోజుల నుండి చర్చల్లో ఉన్నదే. వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తారని, ప్రాజెక్ట్ పేరు ‘రామారావుగారు’ అని రకరకాల వార్తలు వినబడ్డాయి. కానీ అవి కేవలం వార్తలుగా ఉండిపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం త్వరలోనే వీరి సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్రజెంట్ ‘ఎఫ్ 3’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ డేట్స్ ఖాళీగా లేవు. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది.

దీంతో బాలయ్య, అనిల్ రావిపూడిల కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్టే అంటున్నారు. ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారు. అది పూర్తైన వెంటనే అనిల్ రావిపూడి సినిమా ఉండవచ్చట. ఇటీవలే ఇద్దరి మధ్యన కథా చర్చలు జరిగాయని, బాలయ్య రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలు నిజమా కాదా అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :