‘ఇరుముడి’కి లైన్ క్లియర్.. అప్పటికి ‘ప్యారడైజ్’ వాయిదా?

‘ఇరుముడి’కి లైన్ క్లియర్.. అప్పటికి ‘ప్యారడైజ్’ వాయిదా?

Published on Jun 30, 2026 3:00 PM IST

రానున్న రోజుల్లో మన టాలీవుడ్ నుంచి పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ ఒకటి కాగా మరోటి మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి. ఈ సినిమాతో రవితేజ న్యూట్రల్ ఆడియెన్స్ లో కోల్పోయిన ఫామ్ ని మళ్లీ తెచ్చుకొని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అనేట్టు పరిస్థితులు మారాయి.

కానీ ఈ రెండు సినిమాలు ఆగస్టు 21 డేట్ కి లాక్ అయ్యాయి. అయితే ఈ క్లాష్ దాదాపు ఉండకపోవచ్చు అనే బజ్ అయితే ఉంది కానీ మొన్నామధ్య వచ్చిన అప్డేట్ తో ప్యారడైజ్ మేకర్స్ క్లాష్ ఆన్ లోనే ఉందని కన్ఫర్మ్ చేశారు. కానీ లేటెస్ట్ రూమర్స్ ప్రకారం నాని సినిమా ఇరుముడి కి లైన్ క్లియర్ చేసి అక్టోబర్ నెలకి షిఫ్ట్ అయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజం అయితే మాత్రం ఇరుముడి గట్టి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు