రజినీకాంత్ ‘లింగ’ ఆడియో రిలీజ్ డేట్

రజినీకాంత్ ‘లింగ’ ఆడియో రిలీజ్ డేట్

Published on Sep 5, 2014 8:44 AM IST

lingaa
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లింగ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటక లోని శిమోఘలో జరుగుతోంది. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 23న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో కథా పరంగా గ్రాఫిక్స్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం కొన్ని సాంగ్స్ కోసం యూరప్ వెళ్లనున్నారు. వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసిన లింగ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ భారీ బడ్జెట్ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు.
‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాల తర్వాత రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు