
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా ‘లింగ’. యుఎస్ లో ఈ సినిమా సరికొత్త రికార్డులను లిఖిస్తుంది. తెలుగు, తమిళ భాషలలో 310 థియేటర్లలో విడుదలవుతుంది. సౌత్ సినిమా ఇంత భారి ఎత్తున విడుదలవడం ఇదే తొలిసారి.
మిడ్ వెస్ట్ యుఎస్ లో గల అతి పెద్ద ఆడిటోరియంలలో ఒకటైన మువికో రోసేమొంట్ థియేటర్, ఎక్స్ ఎల్ ఐమాక్స్ స్క్రీన్ లో వారం రోజుల పాటు ‘లింగ’ను ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ సినిమా కాకుండా మరొక భాషకు చెందిన సినిమాను ఈ ఎక్స్ ఎల్ ఐమాక్స్ స్క్రీన్ లో ప్రదర్శించడం ఇదే తొలిసారి. అది కూడా రజనీకాంత్ సినిమా కావడం విశేషం. ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభానికి ముందే 500 వందల టికెట్లను రజినీకాంత్ వీరాభిమానులు కొనుగోలు చేశారు.
ఇలా విడుదలకు ముందు రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తున్న ‘లింగ’, విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా, అనుష్క కధానాయికలు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.