రెండవ వారంలో సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన ‘లింగ’ రెండవ వారంలో వసూళ్ళు మందగించినప్పటికీ అరుదైన రికార్డుని సాధించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. తమిళ వెర్షన్ ‘లింగ’ ఓవర్సీస్ లో 2014సంవత్సరానికి అత్యధిక కలెక్షన్లను సాధించింది.
గతంలో విజయ్ నటించిన కత్తి సినిమా 35.16 కోట్లు సాధిస్తే ఇప్పుడు లింగ 37.35 కోట్లను గడించింది. అయితే అత్యధిక రికార్డు మాత్రం రజిని రోబో సినిమా పేరిట 55 కోట్లతో చెక్కుచెదరకుండా వుంది.
ఈ సినిమా విడుదలైన నాటినుండీ రజిని మ్యాజిక్ పుణ్యమా అని కలేక్షనలకు డోకా లేకుండా పోయింది. అయితే డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఈ చిత్రం నిరాశను మిగాల్చనుంది


