
దాదాపు నాలుగేళ్ళ తరువాత రజిని నటించిన ‘లింగ’ సినిమాకు భారీ అంచనాలు ఏర్పడడం సర్వసహజం. అయితే నిన్న రజిని జన్మదినం సందర్భంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను నిరాశపరిచింది. చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడి లోపం కొట్టొచ్చినట్టు కనబడింది.
సినిమా నిడివి ఎక్కువవడం, రజిని మార్క్ ఫైట్ లు లేకపోవడం ప్రధాన మైనస్ లు గా వినిపిస్తున్నాయి. దీనివలన సోషల్ మీడియాలో రజిని అభిమానులు దర్శకుడిని దుమ్మెత్తిపోస్తున్నారు