12000 రూపాయలకి తెగిన ‘లింగ’ మొదటి టికెట్..

lingaa
దాదాపు రెండున్నర సంవత్సరాల తరువాత సూపర్ స్టార్ రజిని మరోసారి తన అభిమానులను సందడి చేయనున్నారు. మధ్యలో కొచ్చాడయాన్ సినిమా వచ్చినా అది కేవలం గ్రాఫిక్స్ చిత్రంగానే ప్రేక్షకులు పరిగణించారు. అభిమానుల నిరీక్షణను భరించలేక కేవలం 6నెలలో కె.ఎస్ రవికుమార్ ‘లింగ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది

సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి టికెట్ 12000 రూపాయలకు ఒక అభిమాని సొంతం చేసుకున్నాడు. రజిని మీద తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నట్టు తెలుపడం విశేషం. ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. ఏ.ఆర్ రెహమాన్ స్వరకర్త. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత

Exit mobile version