సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘లింగ’. ఆదివారం రాత్రి చెన్నైలో ఈ చిత్ర ఆడియోను విడుదల చేశారు. ఆడియోతో పాటు విడుదల చేసిన చిత్ర ట్రైలర్ యుట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 24 గంటల్లో ఈ చిత్ర తమిళ ట్రైలర్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు.
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ సరసన ఈ చిత్రంలో అనుష్క, సొనక్షి సిన్హా కధానాయికలుగా నటించారు. వీరిద్దరూ రజినితో తొలిసారి నటించడం విశేషం. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు.
ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఈరోస్ సంస్థ సొంతం చేసుకుంది. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయనున్నారు.
‘లింగ’ తమిళ ట్రైలర్ వీక్షించడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


