ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ‘లింగ’. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు 8 కోట్ల 40 లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని సమాచారం. సుమారు నాలుగేళ్ల తర్వాత రజినీకాంత్ నటిస్తున్న లైవ్ యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలు ఉన్నాయి.
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు ఇటివలే విడుదలయ్యాయి. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈరోస్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.


