డిసెంబర్ 7 నుంచి తెలుగులో ‘లింగ’ ప్రమోషన్స్

డిసెంబర్ 7 నుంచి తెలుగులో ‘లింగ’ ప్రమోషన్స్

Published on Dec 4, 2014 2:49 PM IST

lingaa-sencor
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ – కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లింగ’. ఈ సినిమా డిసెంబర్ 12న భారీ ఎత్తున విడుదలకి సిద్దమవుతోంది. లింగ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచి సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ఈ చిత్ర టీం కూడా సన్నాహలు చేస్తోంది.

ఇప్పటివరకూ తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్ర టీం ముందుగా తెలుగులో కూడా భారీగా ప్రమోట్ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. డిసెంబర్ 7న ఈ చిత్ర టీం హైదరబాద్ వచ్చి లింగ సినిమాని ప్రమోట్ చేయనున్నారు. దాదాపు ఈ చిత్ర టీం అంతా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు