తాజా సమాచారం ప్రకారం లింగా సినిమాకు అంతరాయం కలిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి రామోజీ ఫిలింసిటీలో నగర వాసులకి, చిత్ర బృందానికి మధ్య జరిగిన వాగ్వివాదం దీనికి కారణమని సమాచారం. అసలు ఈ గొడవకి మూలకారణం రామోజీ ఫిలింసిటీ దగ్గర వుండే చిన్న సరస్సు వద్ద మొదలైంది.
అక్కడ గ్రామీణ వాసులు ఆ సరస్సు తమకి త్రాగునీటి ఏకైక ఆధారమని ఇక్కడ షూటింగ్ కుదరదిని చెప్పడంతో షూట్ కి అంతరాయం కలిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ వారికోరిక మేరకు షూటింగ్ ని నిలిపివేశారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
ఈ చర్చలు విఫలమయితే చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోస్ కి బయలుదేరడానికి సిద్ధంగావుంది.


