సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే సౌత్ ఇండియన్ సినీ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. ప్రతి ఒక్క సినీ అభిమాని ఆయన స్టైల్ మరియు పంచ్ డైలాగ్స్ కోసం రిలీజ్ రోజు థియేటర్స్ ముందు క్యూ కడతారు. అదే సంఘటన మరో రెండు రోజుల్లో రజినీకాంత్ బర్త్ డే రోజున జరగనుంది. రజినీకాంత్ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘లింగ’ డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
‘లింగ’ సినిమా ప్రారంభమైన రోజు నుంచి సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తోంది. తాజాగా రిలీజ్ విషయంలో కూడా లింగ మరో రికార్డ్ ని సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా లింగ సినిమా యుఎస్ లో 300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఒక్క ఓవర్సీస్ లోనే 300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కావడం ఇదే ప్రధమం. ఇది కాకుండా ‘లింగ’ ప్రపంచవ్యాప్తంగా 2300 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ డాల్స్ అయిన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.


