తెలుగులో గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న సమంతపై తమిళంలో ఐరన్ లెగ్ ముద్ర పడింది. అక్కడ సమంత నటించిన చిత్రాలన్ని ప్లాప్ అయ్యాయి. ఇదే సమయంలో తెలుగులో ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్ కావడమే కాదు, ‘ఏం మాయ చేశావే’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు పొందింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత తమిళంలో నటించిన చిత్రం ‘అంజాన్’. తెలుగులో ‘సికిందర్’ పేరుతో విడుదలవుతుంది. ఈ సినిమాలో సమంత ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని దర్శకుడు లింగుస్వామి చెప్తున్నారు. సమంత నటన కోసం సినిమాను రెండోసారి చూడొచ్చని అంటున్నారు.
సూర్య కోసం మూడు సాలు కథను మార్చాం. హీరోయిన్ గా సమంతను ఫిక్స్ అయ్యాం. తనొక అద్బుతమైన నటి. ‘అంజాన్’లో సమంత పెర్ఫార్మన్స్ పరంగా ఇరగదీసింది. ఓ రోడ్ పక్కన సమంత, సూర్య, విద్యుత్ జమాల్ మధ్య జరిగే సీన్ లోనూ, కార్ లో జరిగే మరొక సీన్ లో సమంత అద్బుతమైన హావభావాలు(ఎక్స్ ప్రేషన్స్) పలికించిందని లింగుస్వామి తెలిపారు. ఈ చిత్రంతో తమిళంలో పాగా వేయాలని సమంత భావిస్తుంది.
కార్తి హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎన్ని ఎజునాల్’ చిత్రంలో సమంత హీరోయిన్ అని దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. మొదటి సూర్యకు చెప్పిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.


