తమిళ్, కన్నడ స్టార్స్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ

తమిళ్, కన్నడ స్టార్స్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ

Published on Jun 1, 2026 12:15 PM IST

గత ఏడాది తెలుగు సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయ్యిన పలు చిన్న చిత్రాల్లో లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో తెలుగు బ్యూటీ శివాని నాగారం హీరోయిన్ గా నటించి అందరి దృష్టి ఆకర్షించింది. మొత్తం మూడు సినిమాలు తెలుగులో చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓ క్రేజీ కాంబినేషన్ లో ఛాన్స్ కొట్టేసింది.

తన డెబ్యూ సినిమాతోనే తమిళ్ లో అదరగొట్టిన యువ దర్శకుడు హీరో అభీషన్ జీవింత్ అలాగే కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శివాని కూడా నటిస్తున్నట్టు ఇపుడు ఖరారు అయ్యింది. నిజానికి అభీషన్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తాడని చాలామంది అనుకున్నారు కానీ ఈ చిత్రాన్ని గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహించనున్నారు. ఇలా కన్నడ, తమిళ్ స్టార్స్ సినిమాలో శివానికి లక్కీ ఛాన్స్ నే దొరికింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది.

తాజా వార్తలు