ఇలాగే యంగ్‌ గా, సంతోషంగా జీవించు – మహేష్ బాబు
Published on Jul 27, 2018 4:15 pm IST


వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు వంశీ పైడిపల్లి పుట్టినరోజు.ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘40 ఏళ్ల యువ దర్శకుడు అయినా నా ప్రెండ్ వంశీ పైడిపల్లికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు 40 సంవత్సరాలంటే నమ్మబుద్ది కావడంలేదు, అనుమానాం లేదు నీకు 20 సంవత్సరాలే. ఇలాగే యంగ్‌ గా, సంతోషంగా జీవించు.’అని తెలుపుతూ వంశీతో దిగిన ఫోటోను కూడా సూపర్ స్టార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అయితే వంశీ పైడిపల్లి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ ఈ చిత్రంలో రెండు వేరు వేరు లుక్స్ లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్, పివిపి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook