‘లోఫర్’ సినిమా ‘పోకిరి’ని మించి ఉంటుందట.!

‘లోఫర్’ సినిమా ‘పోకిరి’ని మించి ఉంటుందట.!

Published on Sep 27, 2015 5:48 PM IST

Loafer

శరవేగంగా సినిమాలు చేసే టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేస్తున్న తదుపరి సినిమా ‘లోఫర్’. ‘ముకుంద’ లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూడవ సినిమా ‘లోఫర్’. జూలైలో మొదలైన ఈ సినిమా షూటింగ్ అప్పుడే చివరి దశకు వచ్చేసింది. ఇటీవలే గోవా షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చిన ఈ చిత్ర టీం లోఫర్ ని పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తయారు చేస్తున్నారు.

ఈ చిత్ర విశేషాలను తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఇటీవలే మా చిత్ర టీం గోవా షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చింది. ఇంకా 5 రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. పూరి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన పోకిరిని మించి ఈ సినిమాలో కంటెంట్ ఉంటుంది, కలెక్షన్స్ పరంగా కూడా ఆ సినిమాని మించేలా ఉంటుంది. ఇలాంటి సినిమాని నా బ్యానర్ కి ఇచ్చినందుకు స్పెషల్ థాంక్స్. సినిమా విషయంలో నన్నెక్కడా ఇబ్బంది పడనీయకుండా అన్నీ ఆయనే చూసుకున్నాడు. పూరి ఒప్పుకుంటే కంటిన్యూగా యనతో సినిమాలు చెయ్యాలని ఉందని’ తెలిపాడు.

వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నోర ఫతేహి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు