లాక్డౌన్ కారణంగా తండ్రి చివరి చూపుకునోచుకోని స్టార్ హీరో

లాక్డౌన్ కారణంగా తండ్రి చివరి చూపుకునోచుకోని స్టార్ హీరో

Published on Apr 23, 2020 11:00 PM IST

Mitun

బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి లాక్ డౌన్ కారణంగా తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి మంగళవారం అర్దరాత్రి మరణించారు. 95 ఏళ్ల బసంత్ కుమార్ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బసంత్ కుమార్ చిన్న కుమారుడు నిమాషి చక్రవర్తి వెల్లడించారు.

గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. అయితే మిథున్ చక్రవర్తి షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లగా, లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. దీంతో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేని పరిస్థితి.

తండ్రిని కడసారి చూసేందుకు ముంబై తిరిగి రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని తమ్ముడు నిమాషి పేర్కొన్నాడు. బసంత్ కుమార్ మరణంపై పలువురు బాలీవుడ్ నటులు, దర్శకులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు