లాక్ డౌన్ రివ్యూ : చమన్ బాహర్ హిందీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్

లాక్ డౌన్ రివ్యూ : చమన్ బాహర్ హిందీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్

Published on Jun 20, 2020 3:26 PM IST

నటీనటులు: భువన్ అరోరా, రితికా బడియాని, ఆలం ఖాన్, అశ్వని కుమార్, జితేంద్ర కుమార్, ధేరేంద్ర కుమార్ తివారీ

దర్శకత్వం: అపుర్వా ధర్ బాద్గైయాన్

నిర్మాత: సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, విక్రమ్ మెహ్రా

సినిమాటోగ్రఫీ: ఆర్కోదేబ్ ముఖర్జీ

సంగీతం: మంగేష్ ధక్డే, అన్షుమాన్ ముఖర్జీ

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ ఫిల్మ్ చమన్ బాహర్ ఎంచుకోవడం జరిగింది. రొమాంటిక్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

 

చత్తీష్ ఘడ్ లోని ఒక చిన్న ఊరి చివర బిల్లు (జితేంద్ర కుమార్) ఓ పాన్ డబ్బా పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. నిస్తేజంగా సాగుతున్న అతని జీవితంలోకి రింకు ( రతికా బడినాయ్)రాకతో కొత్త మలుపు తిరుగుతుంది. రింకు ఫ్యామిలీ తన పాన్ కొట్టు ఎదుటి ఇంటిలో దిగుతారు. మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడిన బిల్లు ఆమె ప్రేమకోసం పరితపిస్తూ ఉంటాడు. రింకు అందం చూసి ఊరిలో కుర్రాళ్ళు అందరూ తన వెనుకే పడతారు. బిల్లు పాన్ డబ్బా దగ్గరకొచ్చి రింకు కు లైన్ వేస్తూ ఉంటారు. మరి ఇంత హెవీ కాంపిటీషన్ మధ్య బిల్లు… రింకు ప్రేమను గెలిచాడా? లేదా? అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

 

ఈ మూవీ స్టోరీ ఐడియా కొత్తగా మెప్పిస్తుంది. శుబ్ మంగళ్ జ్యాదా సావధాన్ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన జితేంద్ర కుమార్ ఈ మూవీలో మంచి నటనతో ఆకట్టుకున్నారు. భిన్న షేడ్స్ ఉన్న పాత్రను జితేంద్ర తన సహజమైన నటనతో మెప్పించారు. సోను నిగమ్ పాడిన రెండు సాంగ్స్ అద్బుతంగా ఉన్నాయి.

ఓ చిన్న ఊరిలోకి అందమైన అమ్మాయి వస్తే తన వెంటపడే యువకుల మనస్తత్వాలు చక్కగా వివరించారు. హీరోయిన్ గా నటించిన రతిక పాత్రకు అంతగా పరిదిలేదు. ఐతే ఆమె తెరపై క్యూట్ గా కనిపించారు. హీరోకి, అతని తండ్రి కి మధ్య రిలేషన్ ఆకట్టుకుంటుంది. కథలో ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ చక్కగా కుదిరాయి.

 

ఏమి బాగోలేదు?

 

మెల్లగా సాగే కథనంతో పాటు హీరోయిన్ పాత్రను కేవలం కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు. ప్రధాన కథలోకి వెళ్లడాని చాలా అనవసర సన్నివేశాలతో సాగదీశారు. కథకు అంతగా సంబంధం లేని గ్రామీణ నిరుద్యోగ యువకులకు సంబందించిన సన్నివేశాలు ఎడిట్ చేయాల్సింది.

 

మొత్తంగా

 

మెల్లగా సాగే కథనం మినహాయిస్తే ఈ విలేజ్ ప్రేమ కథ చాల వరకు మెప్పిస్తుంది. జితేంద్ర నటన, ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ రతిక క్యూట్ లుక్స్ ఆకట్టుకొనే అంశాలు. మొత్తంగా చమన్ బాహర్ ఆకట్టుకొనే చిత్రమే అని చెప్పాలి.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు