లాక్ డౌన్ రివ్యూ: ఘోస్ట్ స్టోరీస్ హిందీ యాంథోలజి (నెట్ ఫ్లిక్స్)

నటీనటులు: శోభిత ధులిపాల, మృనాల్ ఠాకూర్, అవినాష్ తివారీ, జాన్వి కపూర్, సురేఖా సిక్రీ, రఘువీర్ యాదవ్, గుల్షన్ దేవయ్య, అనీష్ బామ్నే, పావెల్ గులాటి

దర్శకత్వం: కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్

నిర్మాతలు: రోనీ స్క్రూవాలా, ఆశి దువా

సినిమాటోగ్రఫీ: సిల్వెస్టర్ ఫోన్‌సెకా, తనయ్ సతం, కమల్‌జీత్ నేగి, మను ఆనంద్, మితేష్ మిర్చందాని, రంజన్ పాలిట్

 

లాక్డౌన్ సిరీస్ లో నేడు ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ని తీసుకోవడం జరిగింది. అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్, మరియు కరణ్ జోహార్ వంటి నలుగురు దర్శకులు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

 

కథాంశం ఏమిటీ?

జాన్వీ కపూర్, శోభిత దూళిపాళ్ల, మృణాల్ ఠాకూర్ మరియు సుకాంత్ గోయెల్ ప్రధాన పాత్రలో నాలుగు భిన్న హారర్ కథల సారాంశమే ఘోస్ట్ స్టోరీస్. హార్రర్ ప్రధానంగా భిన్న నేపధ్యాలలో ఈ ఘోస్ట్ స్టోరీస్ సిరీస్ సాగుతుంది.

 

ఏమి బాగుంది?

మొదటిసారి వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్ జాన్వీ కపూర్ నర్స్ గా సహజ నటన కనబరిచింది. ఆ పాత్రకు ఆమె చక్కగా సరిపోయింది. హరర్ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఇక నాలుగు ప్రధాన పాత్రలలో అమితంగా ఆకట్టుకున్న నటి శోభితా దూళిపాళ్ల. నిజానికి కలకి తేడా తెలియని అయోమయంలో ఉండే అమ్మాయిగా ఆమె నటన మెప్పిస్తుంది. ఇక నాలుగు కథల ప్రారంభం బాగుంటుంది.

 

ఏమి బాగోలేదు?

డైరెక్టర్ జోయా అక్తర్ హారర్ స్టోరీలో జాన్వీ నటన ఆకట్టుకున్నా అద్భుతం అని చెప్పలేం. కొన్ని సీన్స్ లో ఆమె నటన తేలిపోతుంది.

అనురాగ్ కశ్యప్ స్టోరీ విషయానికి వస్తే నటి శోభిత తన అద్భుత నటనతో ఆసక్తిగా మలచాలని ప్రయత్నించినా, హార్రర్ లేని బలహీనమైన కథ మెప్పించలేకపోయింది.

ఇక మరో ఇద్దరు దర్శకులు దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ పనితనం కూడా ఏమి బాగోలేదు. చాలా ఆధునిక భావజాలం కలిగిన కరణ్ ఎపిసోడ్ లో మొదటి నుండి స్టోరీ ఊహకు అందేలా సాగుతుంది.

 

చివరి మాటగా

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, స్టార్ కాస్ట్ తో, ఉన్నత విలువలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కంటెంట్ పరంగా ఏమాత్రం ఆకట్టుకోదు. నాలుగు హారర్ స్టోరీస్ లో ఒక్కటికూడా ప్రభావంతంగా ఉండదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సిరీస్ ఆ అంచనాలు అందుకోలేదనే చెప్పాలి.

Rating: 2/5

సంబంధిత సమాచారం :

More