లాక్ డౌన్ రివ్యూ: కడక్- హిందీ ఫిలిం (సోనీ లివ్)

తారాగణం: సాహుకర్, శ్రుతి సేథ్, రజత్ కపూర్, తారా శర్మ సలుజా, సాగర్ దేశ్ముఖ్, నూపూర్ అస్తానా, కల్కి కోచ్లిన్, చంద్రచూర్ రాయ్, పలోమి ఘోష్, మనోజ్ పహ్వా, మరియు యామిని దాస్

దర్శకుడు: రజత్ కపూర్

నిర్మాత: గురుదాస్ పై, మిత్యా టాకీస్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ ఫిల్మ్ కడక్ ని ఎంచుకోవడం జరిగింది. సోనీ లివ్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో రాఘవ్ (చంద్రచోర్ రాయ్) సునీల్ (రణ్వీర్ షోరే) ఇంటికి వెళతాడు. ఈ విషయమై సునీల్ మరియు రాఘవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. భార్య చేతిలో మోసపోయానని తీవ్ర అసహనంలో ఉన్న రాఘవ్ తనని తాను తుపాకీతో కాల్చుకొని చనిపోతాడు. ఆ సంఘటనతో సునీల్ అతని భార్య (మాన్సి ముల్తానీ) షాక్ కి గురవుతారు. అదే రోజు దీపావళి కావడంతో బంధులు మరియు మిత్రులు సునీల్ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఆ ఇంట్లో శవం ఉందని తెలియని బంధువుల నుండి వారు రాఘవ్ శవాన్ని ఎలా దాచారు? చివరికి వీరి దీపావళి ఎలా ముగిసింది అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

అధ్బుత నటుడిగా పేరున్న రణ్వీర్ షోరే మరో మారు తన సత్తా చాటాడు. ఇంట్లో జరిగిన ఊహించని సంఘటన వలన ఎదురయ్యే టెన్షన్ మరియు ఫ్రస్ట్రేషన్ వంటి ఎమోషన్స్ ఆయన చక్కగా పలికించాడు. సీరియస్ గా సాగే అతని పాత్రలో కామెడీ జొప్పించిన విధానం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది.

డార్క్ కామెడీ మరియు ఎమోషన్స్ అలరిస్తాయి. రణ్వీర్ షోరే భార్య పాత్ర చేసిన మాన్సి ముల్తానీ పాత్ర పరిధిలో అలరించారు. కథలో ట్విస్ట్స్ పరవాలేదు.

 

ఏమి బాగోలేదు?

ఒక సింపుల్ కథకు దర్శకుడు ఇచ్చిన ప్రారంభం బాగుంది. ఐతే చివరి అర గంట సినిమా పక్కదారి పట్టింది. అనేక పాత్రలు ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా, మెయిన్ పాయింట్ నుండి డైల్యూట్ చేస్తాయి. ఇక చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సిల్లీగా సాగుతాయి. ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఇద్దరు భార్య భర్తల ప్రవర్తన వాస్తవానికి దూరంగా ఉంది.

 

చివరి మాటగా

డార్క్ కామెడీ తో సాగే కడక్ మూవీలో రణ్వీర్ షోరే నటన నేపథ్యంలో సాగే కామెడీ అలరిస్తాయి. మంచి ప్రారంభం కలిగిన ఈ మూవీ ముఖ్యమైన చివరి అరగంట నిరుత్సాహపరుస్తుంది. అంచనాలు లేకుండా చూస్తే కొంచెం నచ్చే అవకాశం ఉంది.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం :

More