లాక్ డౌన్ రివ్యూ : మెంటల్‌హుడ్ (ఆల్ట్‌బాలాజీ ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : మెంటల్‌హుడ్ (ఆల్ట్‌బాలాజీ ప్రసారం)

Published on Jun 8, 2020 5:16 PM IST

తారాగణం: కరిష్మా కపూర్, సంధ్య మృదుల్, శిక్పాల్ శుక్లా, అమృత పూరి తదితరులు

రచన: కరిష్మా కోహ్లీ

దర్శకత్వం: కరిష్మా కోహ్లీ

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సిరిస్ ‘మెంటల్‌హుడ్’. కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ‘ఆల్ట్‌బాలాజీ’లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరిస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

మీరా శర్మ (కరిష్మా కపూర్) ఒక మాజీ మిస్ కాన్పూర్. అలాగే ప్రస్తుతం ముగ్గురు పిల్లలకు తల్లి కూడా. ఆమె భర్త (సంజయ్ సూరి)తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముంబైలో అడుగుపెడుతుంది. మీరా తన ముగ్గురు పిల్లల గురించి మరియు ఎల్లప్పుడూ బిజీగా ఉండే తన భర్తతో తన జీవితం గురించి వివరించడానికి ఒక బ్లాగును కూడా ప్రారంభిస్తుంది. ఇవే కాకుండా, సంధ్య మృదుల్, శిక్పాల్ శుక్లా, అమృత పూరి వంటి మిగిలిన తల్లులతో కూడా కరిష్మా తన అభిప్రాయాలను పంచుకుంటుంది. మొత్తంమీద ఈ వెబ్ సిరీస్ తమ స్వంత సమస్యలతో ఉన్న సూపర్ మామ్స్ వారి జీవితాల్లోని కీలకమైన దశల ఎలా సాగాయి అనేది మిగతా కథ.

ఏం బాగుంది :

నటీనటుల ప్రదర్శన పరంగా చూసుకుంటే ప్రధానంగా తల్లి పాత్రలో కరిష్మా కపూర్ అద్భుతంగా నటించింది. ఇక తల్లుల పై ఆధారపడి ఉన్న సంఘటనల గురించి, అలాగే తమ సమస్యలు ఉన్నా తల్లలు తమ పిల్లలను మరియు కుటుంబాన్ని ఎలా చూసుకుంటారనే అంశాలు బాగున్నాయి. ఇక నేటి ఆధునిక మహిళల జీవితంలోని వివిధ కోణాలతో పాటు వారి పిల్లలను పెంచే క్రమంలో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి.

శిల్పా శుక్లా, సంధ్య మృదుల్ వంటి ఇతర నటులు కూడా తమ తమ పాత్రలలో బాగా నటించారు. ఇక ఎపిసోడ్ల ప్రారంభ భాగాలలోని అన్ని సమస్యలు బాగా రాశారు. సింగిల్‌ గా డినో మోరియా కూడా తన పనిని సంపూర్ణంగా చేసారు. మొత్తం మీద ఈ వెబ్ సిరీస్ థీమ్ ముఖ్యంగా మహిళలందరికీ చాలా సాపేక్షంగా ఉంటుంది.

ఏం బాగాలేదు :

ఈ సిరీస్ చిన్న సమస్యలను కూడా అతి బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది ప్లే. మధ్యతరగతి తల్లులకు రోజువారీ పనులేమిటి అనే అంశాలు బోర్ గా సాగుతాయి. పైగా చాల సన్నివేశాలు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తాయి. ఎడిటింగ్ కూడా అస్సలు బాగా లేదు. బిజిఎమ్ మరియు కెమెరావర్క్ కూడా జస్ట్ ఒకే అనిపిస్తాయి. ఇక టీనేజ్ పిల్లలతో తల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు సరిగ్గా పరిష్కరించబడేలా సీన్స్ రాసుకోలేదు.

చివరి మాటగా :

మొత్తంమీద, మెంటల్‌హుడ్ అనేది లేడీ-ఓరియెంటెడ్ వెబ్ సిరీస్, ఇది జీవితంలో తల్లి మరియు పిల్లలకు సంబంధించి వచ్చే సంఘటనలకు ఆధారంగా సాగుతుంది. నటీనటుల ప్రదర్శనలు చాలా బాగున్నాయి. ప్రారంభ నాలుగు ఎపిసోడ్‌లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ బాగాలేని సాంకేతిక అంశాలు, అసమాన మరియు ఆకస్మిక ముగింపు ఆడియన్స్ ఫీల్ ను పాడు చేస్తాయి. దాంతో ఈ సిరీస్, బాగుంది అని చెప్పలేము, అలా అని పూర్తిగా బాగాలేదు అని చెప్పలేము. కాబట్టి ఈ లాక్‌ డౌన్ సమయంలో మీకు ఇంకేమీ పనిలేకపోతేనే ఈ సిరీస్‌ పై ఒక లుక్కేయండి.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు