లాక్ డౌన్ రివ్యూ: పంచాయత్ హిందీ వెబ్ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ: పంచాయత్ హిందీ వెబ్ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

Published on May 24, 2020 1:09 PM IST

నటీనటులు: జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా

డైరెక్టర్ : దీపక్ కుమార్ మిశ్రా

సంగీతం: అనురాగ్ సైకియా

సినిమాటోగ్రఫీ: అమితాబ్ సింగ్

నేడు మన లోక్ డౌన్ రివ్యూ సిరీస్ లో హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ ని తీసుకోవడం జరిగింది. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో దీపక్ కుమార్ మిస్త్ర తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అభిషేక్ త్రిపాఠి(జితేంద్ర కుమార్) మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడం వలన తను కోరుకున్న జాబ్ తనకు దక్కదు. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ మారుమూల పల్లెలో పంచాయత్ సెక్రటరీగా అభిషేక్ నియమింపబడతాడు. అయిష్టంగానే ఆ ఊరికి సెక్రెటరీగా వెళ్లిన అభిషేక్ అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని తీవ్ర అసహనానికి గురవుతాడు. కార్పొరేట్ ప్రపంచంలో లావిష్ లైఫ్ అనుభవిద్దాం అనుకున్న అభిషేక్ పల్లె జీవనం ఎలా సాగింది? చివరికి అతని కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

చాలా వెబ్ సిరీస్ లు క్రైమ్ అండ్ థ్రిల్లర్ జోనర్స్ లో వస్తున్న తరుణంలో చక్కని సామాజిక అంశాలతో తెరకెక్కిన పంచాయత్ మెచ్చుకోదగిన అంశం. ఇక కథకు తగ్గట్టుగా పల్లెటూరి వాతావరణం, సెటప్, పాత్రలు చక్కగా కుదిరాయి. ప్రేక్షకులకు ఉత్తర్ ప్రదేశ్ పల్లెలలో తిరిగిన అనుభూతి ఈ మూవీ పంచుతుంది. పల్లె ప్రజల ఇబ్బందులు హ్యూమరిక్ గా చెప్పిన తీరు బాగుంది. పల్లె ప్రజల కష్టాలను, అమాయకత్వాన్ని చక్కగా చూపించారు.

ఇక పల్లెజీవనాన్ని అసలు ఇష్టపడని ఫ్రస్ట్రేటెడ్ పంచాయత్ సెక్రెటరీ పాత్రలో జితేంద్ర కుమార్ చక్కగా నటించారు. అలాగే ఆయన పాత్రతో పాటు సాగే సపోర్టింగ్ రోల్స్ చేసిన నటుల పరఫార్మెన్సు ఆకట్టుకుంది. నీనా గుప్త నటన ఈ సిరీస్ కి మంచి ఆకర్షణ.

 

ఏమి బాగోలేదు?

సోషల్ కాన్సెప్ట్ పై కంటే కూడా పల్లె జీవనాన్ని ఇష్టపడని ఓ యుంగ్ గ్రాడ్యుయేట్ అసహనం పై ఎక్కువ ఫోకస్ చేశారు. పల్లె ప్రజల కష్టాలు, వాటికి సొల్యూషన్స్ పైన కూడా ఫోకస్ పెట్టి ఉంటె డ్రామాలో సీరియస్ నెస్ కూడా వచ్చి చేరేది.

 

చివరి మాటగా

మితిమీరిన వైలెన్స్, శృంగారం చూసి విసిగిపోయిన వారికి పంచాయత్ మంచి ఫీల్ ని ఇచ్చే వెబ్ సిరీస్. చక్కని పల్లె వాతావరణంలో ఆకట్టుకొనే హాస్యంతో సాగే పంచాయత్ సిరీస్ మంచి అనుభూతిని పంచుతుంది.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు