లాక్ డౌన్ రివ్యూ: ది కాసినో-హిందీ వెబ్ సిరీస్(జీ 5)


నటీనటులు: కరణ్‌వీర్ బొహ్రా, ఐంద్రితా రే, మందనా కరీమి, సుధాన్షు పాండే
దర్శకుడు: హార్దిక్ గుజ్జర్
నిర్మాత : బ్యాక్‌బెంచర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: షబ్బీర్ అహ్మద్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు రొమాంటిక్ క్రైమ్ డ్రామా ‘ది కాసినో’ ని ఎంచుకోవడం జరిగింది. జీ 5లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

కథాంశం ఏమిటీ?

నేపాల్ లోని ఓ విలాసవంతమైన కాసినో అధిపతిగా మార్వా(సుధాన్ష్ పాండే) ఉంటాడు. ఇదే క్యాసినోలో డాన్సర్ గా పనిచేసే రిహానా(మందాన కరిమీ) మార్వాను వశపరుచుకొని అతని దగ్గర డబ్బు గుంజాలని చూస్తూ ఉంటుంది. ఐతే మార్వా కొడుకు అయిన విక్కీ మార్వా(కరణ్వీర్ బోహ్రా) కి ఈ వ్యవహారం నచ్చదు. ఐతే కిలాడీ రిహానా తండ్రి కొడుకులు ఇద్దరినీ తన ట్రాప్ లో పడేసే ఆలోచనలో ఉంటుంది. మరి విలాసవంతమైన ఆ కాసినో చుట్టూ తిరిగే ఈ కథ చివరికి ఎలా ముగిసింది అనేది మిగతా కథ…

ఏమి బాగుంది?
అధికారం, ఆధిపత్యం హోదా, డబ్బు కోసం తండ్రి కొడుకులు మరియు ఓ అందమైన అమ్మాయి మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ ప్లే దర్శకుడు చక్కగా నడిపారు. డాడీ పాత్ర చేసిన యంగ్ యాక్టర్ సుధాన్ష్ పాండే లుక్ పరంగా కన్వీన్గింగ్ గా లేకున్నా నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఐతే షో ఆద్యంతం తానై నడిపింది మందాన కరిమీ. ఆమె గ్లామర్ , బోల్డ్ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అని చెప్పాలి.

ఇక కథలో భాగంగా వచ్చే ట్విస్ట్స్ అలరిస్తాయి. మనీ మరియు స్వార్ధం చుట్టూ తిరిగే ఈ సిరీస్ లో ఆ విషయాలను చక్కగా తెరకెక్కించారు. ఇక మరో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిన కరణ్వీర్ బోహ్రా నటనతో ఆకట్టుకున్నారు. బీజీఎమ్, నిర్మాణ విలువలు మరియు కెమెరా వర్క్ మెప్పించాయి.

ఏమి బాగోలేదు?
జూదం, సెక్స్, డ్రగ్స్, క్రైమ్స్ కి అడ్డాగా భావించే కాసినో అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఆ విషయాలపై అంతగా ఫోకస్ చేయలేదు. ఇక ఆ కాసినో గురించి అంతగా కొట్టుకోవడానికి బలమైన కారణం కనిపించదు. ప్రధాన పాత్రధారులు మంచి నటన కనబరిచినా, మిగతా చాలా పాత్రలకు అనుభవం లేని నటులను తీసుకున్నారు. ఇక మిడిల్ ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి. నెక్స్ట్ సీజన్ దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ కూడా సంపూర్ణంగా ముగించలేదు.

చివరి మాటగా
మొత్తంగా ది కాసినో మనీ, స్వార్ధం చుట్టూ నడిచే ఆధిపత్య పోరుగా బాగానే సాగుతుంది. ఐతే కొంచెం బోరు కొట్టే మిడిల్ ఎపిసోడ్స్, అసంపూర్ణమైన ముగింపు నిరాశపరిచే అంశాలు. రొమాన్స్ తో కూడిన క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారు ఓ సారి ఈ సిరీస్ చూడవచ్చు.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం :

More