లాక్ డౌన్ రివ్యూ: హాఫ్ ఆఫ్ ఇట్ ఇంగ్లీష్ మూవీ (నెట్ ఫ్లిక్స్)

నటీనటులు: లేహ్ లూయిస్, డేనియల్ డైమర్, అలెక్సిస్ లెమిర్

దర్శకత్వం: ఆలిస్ వు

నిర్మాతలు : ఆంథోనీ బ్రెగ్మాన్, ఎం. బ్లెయిర్ బ్రార్డ్, ఆలిస్ వు

సంగీతం: అంటోన్ సాంకో

సినిమాటోగ్రఫీ: గ్రేటా జోజులా

లాక్ డౌన్ రివ్యూస్ లో మన నెక్స్ట్ ఛాయిస్ హాఫ్ ఆఫ్ ఇట్. టీనేజ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

ఎల్లీ చు (లేహ్ లూయిస్) చైనా వలస కుటుంబానికి చెందినది ఒక తెలివైన అమ్మాయి.ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడని ఎల్లీ చు తన తండ్రితో కలిసి ఓ విలేజ్ లో ఉంటుంది. తన పాకెట్ మని కోసం తోటి స్టూడెంట్స్ హోమ్ వర్క్స్ పూర్తి చేస్తూ ఉంటుంది. ఒక రోజు తన క్లాస్ మేట్ పాల్ మున్స్కీ (డేనియల్ డైమెర్) క్లాస్ మేట్ ఆస్టర్ ఫ్లోర్స్ (అలెక్సిస్ లెమిర్) ప్రేమ విషయంలో తనకు సహాయం చేయాలనీ ఎల్లీని కోరుతాడు. పాల్ కోరికను అయిష్టంగానే అంగీకరించిన ఎల్లీ, ఆస్టర్ ఫ్లోర్స్ భావాలు, అలవాట్లు నచ్చి అనుకోకుండా ఆమె ప్రేమలో పడిపోతుంది. పాల్ ప్రేమ కోసం ఆస్టర్ ని కలిసిన ఎల్లీ చు అసహజంగా ఆమె పట్ల ఆకర్షించబడుతుంది. మరి పాల్, ఎల్లీ, ఆస్టర్స్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది అనేది మిగతా కథ

 

ఏమి బాగుంది?

ఫ్రెంఛ్ మూవీ సైరెనో దే బెర్గరెక్, దీని ఆధారంగా తెలుగులో వచ్చిన ఊహలు గుసగుసలాడే చిత్రాల పోలికలు ఈ మూవీలో ఉన్నప్పటికీ స్లైట్ హ్యూమర్, హెవీ ఎమోషన్స్ తో డైరెక్టర్ అలిస్ వు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ఎల్లి చు పాత్ర చేసిన లేహ్ లూయిస్ అద్భుత నటన కనబరిచింది. తండ్రి పట్ల ప్రేమ కలిగినఎల్లీ చు అసలు మిగతా రిలేషన్స్ అవసరం లేదనుకునే ఓ సైలెంట్ టీనేజ్ అమ్మాయి, అసహజంగా మరో అమ్మాయి ప్రేమలో పడడం అనేది కన్విన్సింగ్ గా చూపించారు.

ఇతర జాతుల పట్ల అమెరికన్స్ చులకన భావన ఎలా ఉంటుందో ఎల్లి పాత్ర ద్వారా చెప్పిన విధానం నచ్చుతుంది. మూవీ క్లైమాక్స్ మరియు మూడు ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ బాగుంది.

 

ఏమి బాగోలేదు?

మెల్లగా సాగే కథనం, సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టే తిరగడం అనేది ఒక బలహీనత. ఎల్లి, పాల్ పాత్రలను చక్కగా రాసుకున్నప్పటికీ కథలో కీలమైన ఆస్టర్ రోల్ కి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ లేకపోవడం కూడా బాగోలేదు. ఇక ముందుగా చెప్పుకున్నట్లు కొన్ని చిత్రాలను పోలిన కథ కావడం కూడా మరొక మైనస్ గా చెప్పుకోవచ్చు.

 

చివరి మాటగా?

హాఫ్ ఆఫ్ ఇట్ మనసుకు హత్తుకొనే టీనేజ్ రొమాంటిక్ డ్రామా. డైరెక్టర్ అలిస్ వు ఎల్లి పాత్ర ద్వారా మైగ్రంట్స్ సాధక బాధలు, అమెరికన్ సొసైటీలో వారి పట్ల ఉండే ద్రుష్టి కోణం బాగా చూపించారు. తనని తాను వెతుక్కునే క్రమంలో ఎల్లీ ఎమోషనల్ జర్నీ బాగుంది. ఇక కొత్త దనం లేని కథ, స్లో నేరేషన్ కొంచెం ఇబ్బంది పెట్టే అంశాలు. మొత్తంగా హాఫ్ ఆఫ్ ఇట్ మనసుకు హత్తుకొనే టీనేజ్ రొమాంటిక్ డ్రామా అని చెప్పొచ్చు.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం :

More