సూర్య – లోకేష్ కనగ రాజ్ ప్రాజెక్ట్ పై సాలిడ్ క్లారిటీ.!

సూర్య – లోకేష్ కనగ రాజ్ ప్రాజెక్ట్ పై సాలిడ్ క్లారిటీ.!

Published on Mar 31, 2023 7:02 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆ మధ్య ఓటీటీ లో రిలీజ్ చేసిన సినిమాలు తర్వాత థియేట్రికల్ సినిమా కోసం చాలామంది ఎదురు చూశారు. కానీ అప్పుడు వచ్చిన ఈటీ సినిమా డిజాస్టర్ అయ్యింది. మరి ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ రాజ్ కాంబో లో వచ్చినటువంటి “విక్రమ్” లో సెన్సేషనల్ కామియో తో అయితే అదరగొట్టారు.

మరి ఈ క్రేజీ కాంబో లో అయితే ఓ ఫుల్ లెంగ్త్ సినిమాని చాలా మంది ఎదురు చూడగా డెఫినెట్ గా తమ కాంబోలో సినిమా ఉంటుంది అని అలాగే రోలెక్ పై అన్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఇక లేటెస్టుగా అయితే తమిళనాట జరుగిన ఓ అవార్డ్ ఫంక్షన్లలో అయితే లోకేష్ మరోసారి సాలిడ్ అప్డేట్ అందించాడు. ఖచ్చితంగా సూర్య గారితో ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తానని అది సుమారు 150రోజుల మేర షూటింగ్ తో అయితే ఉంటుంది అని అదిరే క్లారిటీ ని ఇచ్చాడు.

దీనితో ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక మరో పక్క సూర్య తన కెరీర్లో 42 వ సినిమాని అయితే దర్శకుడు శివ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు