ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం “లియో”. మరి లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించగా మాసివ్ హైప్ ని అందుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కాస్త అనుకున్న అంచనాలు అందుకోలేదని టాక్ వచ్చింది.
అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళని కొల్లగొట్టిన ఈ చిత్రానికి కూడా పార్ట్ 2 ఉన్నట్టుగా లోకేష్ కనగరాజ్ చెప్పకనే చెప్పాడు. కానీ ఈ మధ్య విజయ్ తన సినిమా కెరీర్ 69వ సినిమాతో ఆపేస్తున్నట్టుగా చెప్పి అందరికీ షాకిచ్చాడు. దీనితో లియో పార్ట్ 2 లేనట్టే అని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ క్రేజీ అప్డేట్ ఇవ్వడం కాస్త ఆశలు రేకెత్తించింది.
లోకేష్ రీసెంట్ గా పాల్గొన్న ఓ ప్రోగ్రాం లో మాట్లాడుతూ తన నుంచి పాజిబులిటీ ఉన్న సీక్వెల్స్ లానే “లియో” కూడా తప్పకుండా పార్ట్ 2 ఉందని కన్ఫర్మ్ చేసాడు. దీనితో విజయ్ ఫ్యాన్స్ అయితే మరో సినిమాలో తమ అభిమాన హీరో కనిపించకపోతాడా అని కొంచెం అసలు అయితే లోకేష్ మాటలతో పెంచుకున్నారు. మరి ఏమవుతుందో ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి.
