ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న సౌత్ స్టార్ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కూడా ఒకరు. అయితే లోకేష్ కనగరాజ్ ఇప్పుడు దర్శకునిగానే కాకుండా హీరోగా సినిమాలు చేస్తుండగా తన దర్శకత్వంలో చేయనున్న నెక్స్ట్ సినిమాపై మాత్రం మూవీ లవర్స్ క్లారిటీ కోరుకుంటున్నారు.
లోకేష్ కనగరాజ్ లైనప్..
అయితే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లైనప్ లో ముందు ఖైదీ 2 స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అవుతుంటే తాను మాత్రం అల్లు అర్జున్, అమీర్ ఖాన్ ఇంకా ఇతర కొత్త హీరోలతో ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సూపర్ హీరో సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టు బజ్ వచ్చింది.
అమీర్ ఖాన్ కొత్త ట్విస్ట్?
కానీ అదే సూపర్ హీరో జానర్ ముందు సినిమా సూర్య, అమీర్ ఖాన్ లతో ప్లాన్ చేసింది, ఆఖరికి బన్నీ దగ్గరకి వచ్చింది అని టాక్ వచ్చింది. సో దీనితో అమీర్ ఖాన్ తో సినిమా కూడా ఆగినట్టే అని అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా అమీర్ ఖాన్ తమ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉందని గత నెలలోనే మాట్లాడుకున్నామని కూడా చెప్పినట్టు ఓ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది. సో అమీర్ ఖాన్ తో సినిమా ఆగలేదు అంటే అల్లు అర్జున్ తో సినిమా ఉన్నట్టా లేనట్టా లేక రెండు వేరే వేరే సబ్జెక్టులా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


