ప్రస్తుతం దక్షిణాది సినిమా దగ్గర మంచి డిమాండ్ ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. తన కొన్ని సినిమాలతోనే మంచి క్రేజ్ ని తాను సొంతం చేసుకున్నాడు. అయితే లోకేష్ కనగరాజ్ తో మన తెలుగు స్టార్స్ వర్క్ అనే మాటే వారి ఫ్యాన్స్ ని మంచి ఎగ్జైటెడ్ గా మారుస్తుంది. ఇలా తెలుగు నుంచి చాలామంది స్టార్ హీరోలు ఈ లిస్ట్ లో ఉన్నారు కానీ ఈ మధ్య మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
లోకేష్ అయితే ఇద్దరి మధ్యలో లాక్ అయినట్టు వినిపిస్తుంది. టాప్ నిర్మాణ సంస్థల దగ్గర పవన్ ఇంకా, లోకేష్ ల డేట్స్ ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ ని మెటీరియల్ చేయాలని చూస్తుంటే లోకేష్ అల్లు అర్జున్ తో ఓ భారీ సినిమా అనుకుంటున్నట్టు కూడా టాక్ ఉంది. అంతే కాకుండా పవన్ కోసం కూడా క్రేజీ సబ్జెక్టు లోకేష్ సిద్ధం చేసినట్టు టాక్ ఉంది. సో రెండు వైపుల నుంచి కొంచెం పరిస్థితి అటు ఇటు గానే ఉంది. మరి ఎవరితో కాంబినేషన్ లాక్ అవుతుంది అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
