విజయ్ తో మళ్ళీ ప్లాన్ చేస్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్ !

Published on Jun 27, 2021 9:08 pm IST

తమిళ్ స్టార్ హీరో విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. అందుకే, విజయ్ మరోసారి లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా తన తరువాత సినిమాని తీసే బాధ్యతని లోకేష్ కనగరాజ్ కి మళ్ళీ ఇచ్చాడట విజయ్. ఇప్పటికే విజయ్ కి లోకేష్ కనకరాజ్ కథ చెప్పాడు.

కాగా వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా మొదలు కానుందని తెలుస్తోంది. నిజానికి ‘మాస్టర్’ రిజల్ట్ లో దమ్ము లేదని విమర్శలు వచ్చినా.. విజయ్ ఇంకా లోకేష్ పై నమ్మకం ఉంచడం నిజంగా విశేషమే. మాస్టర్ తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టడంతో వీరి కలయికలో రానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :