సమంతాకి వెల్లువెత్తుతున్న ప్రశంసల జల్లు.!

Published on Jun 5, 2021 10:00 am IST

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని పలు ఆసక్తికర చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సామ్ నుంచి మొట్ట మొదటి ఓటిటి ఎంట్రీ మాత్రం చాలా గ్రాండ్ గా వచ్చింది అని చెప్పాలి. ఇండియన్ ఓటిటి హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ అయిన సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో భాగం అయ్యి హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ సిరీస్ లోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది అన్న వార్త తర్వాత అంతకు మించిన స్థాయిలో నిన్న ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో విడుదల అయ్యాక తన కెరీర్ లోనే నెవర్ బిఫోర్ రెస్పాన్స్, ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఒక నటిగా ఈ సిరీస్ సామ్ కు సూపర్బ్ స్కోప్ ఇవ్వడం మొత్తం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అంతా తన ముక్త కంఠంతో ఆమెకు ప్రశంసలు కురిపిస్తుంది.

ఒక్క అభిమానులు నుంచే కాకుండా అనేక మంది సినీ ప్రముఖులు, తన తోటి స్టార్ హీరోయిన్స్ కూడా సామ్ కు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ సిరీస్ తో సామ్ పేరు మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అవుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :