ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్ లలో 100 రోజులు పూర్తిచేసుకుంది అంటే అది విశేషమనే చెప్పాలి. అయితే గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమా ఈ ఫీట్ ని సాధించింది. కుటుంబ సంబంధాలకు చక్కని కామెడీని జతచేసి రొటీన్ డ్రామాకు సైతం మంచి హిట్ ని అందుకున్నారు
శ్రీవాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బ్రహ్మానందం, 30 ఇయర్స్ పృథ్వి, హంసానందిని ల పాత్రలు సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. కోనా వెంకట్, గోపీ మోహన్ ల రచనా చాతుర్యం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.


