ల‌వ్ మౌళి.. అమ్మాయిల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది – డైరెక్ట‌ర్ అవ‌నీంద్ర‌

ల‌వ్ మౌళి.. అమ్మాయిల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది – డైరెక్ట‌ర్ అవ‌నీంద్ర‌

Published on Jun 5, 2024 8:46 PM IST

ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ న‌వ‌దీప్ నటిస్తున్న స‌రికొత్త సినిమా ‘ల‌వ్ మౌళి’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో న‌వ‌దీప్ 2.0 అవ‌తార్ లో క‌నిపిస్తున్నాడు. రాజ‌మౌళి శిష్యుడు అవ‌నీంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఈ చిత్ర టీజ‌ర్, ట్రైల‌ర్ల‌లోని కంటెంట్ తో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. బోల్డ్స్ సీన్స్ ఉన్నా సింగిల్ క‌ట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజవుతున్న ‘ల‌వ్ మౌళి’ మూవీ గురించి ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.

బోల్డ్ కంటెంట్ తో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌డంపై మీ కామెంట్..?
ఆర్ఆర్ఆర్ రైటింగ్ లో ఉన్న‌ప్పుడు ఈ క‌థ గురించి అనుకున్నాను. అప్ప‌టికే ఎన్నో క‌మ‌ర్షియల్ క‌థ‌లు రాసినా, కొత్త‌గా ఏదైనా ట్రై చేద్దామ‌ని ఈ క‌థ‌ను రాసుకున్నా.

న‌వ‌దీప్ కోస‌మే ఈ క‌థ రాశారా..?
క‌థ రాస్తున్న‌ప్పుడు ఫ‌లానా హీరో అని ఏమీ అనుకోలేదు. క‌థ పూర్త‌య్యాక ఏంతో మంది హీరోల‌ను అందులో ఊహించుకున్నాను. అయితే, న‌వ‌దీప్ ఎలా ఉంటాడా అని ఆలోచిస్తూ అత‌డికి క‌థ చెప్పాను. ఇలాంటి క‌థ కోసమే అత‌డు వెయిట్ చేస్తుండ‌టంతో అలా ఈ సినిమాకు సెట్ అయ్యాడు.

ఈ క‌థ‌లో ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశం ఏమిటి..?
ఇదొక బోల్డ్ కంటెంట్ అని అంతా అనుకుంటున్నారు. కానీ, ఇందులోని లొకేష‌న్స్, హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ అంద‌రికీ న‌చ్చుతాయి. ముఖ్యంగా అమ్మాయిల‌కు ఈ సినిమా బాగా క‌నెక్ట్ అవుతుంది.

రిలీజ్ కు ముందే ప్రివ్యూ వేయ‌డం రిస్క్ అనిపించ‌లేదా..?
వైజాగ్ లో ప్రివ్యూ వేసేందుకు ఆలోచించాం. ఒకవేళ టాక్ బ‌య‌టకొస్తే ప‌రిస్థితులు ఎలా ఉంటాయా అని. ఏదేమైనా ఓసారి టెస్ట్ చేద్దామ‌ని ప్రివ్యూకి బుకింగ్స్ ఓపెన్ చేశాం. టికెట్లు పూర్త‌వ‌గానే తెలిసింది, బ‌య‌ట ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంత‌లా ఎదురుచూస్తున్నారో అని. రెస్పాన్స్ చాలా బాగా వ‌చ్చింది.

సెన్సార్ వారు A స‌ర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు..?
సెన్సార్ వారు U/A స‌ర్టిఫికెట్ ఇస్తామ‌న్నారు. కానీ 20 క‌ట్స్ చెప్పారు. నేను స‌సేమిరా అన్నాను. దీంతో వారు A ఇస్తామన్నారు. నేను ఈ క‌థ‌ను రాసిందే 18+ వారికి కాబ‌ట్టి ఓకే చెప్పాను.

ఈ మూవీ బ‌డ్జెట్ అనుకున్న‌దానికంటే ఎక్కువ‌య్యిందా..?
అలా ఏం లేదు. లాక్ డౌన్ వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ప‌డ్డాం. కానీ ప‌క్కా ప్లానింగ్ తో ఉన్నాం కాబట్టి బ‌డ్జెట్ లిమిట్ దాటకుండా చూసుకున్నాం.

ఇందులో ఎలాంటి ల‌వ్ స్టోరీని చూపిస్తున్నారు..?
ఫాంట‌సీ బేస్ త‌రువాత‌ వ‌చ్చే స్టోరీల్లో రియాలిటీ ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవితంలో ఎక్క‌డో ఒక చోట ఆ పాత్ర‌లో క‌నెక్ట్ అవుతారు. ఓ జంట రెండేళ్లు రిలేష‌న్ లో ఉన్న త‌రువాత వారి మ‌ధ్య ఎందుకు సంతోషం ఉండ‌టం లేదు.. అనే ప్ర‌శ్న‌కు ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమాను తీశాను. ల‌స్ట్ కోసం చేసిన సినిమా కాదు.. ల‌వ్ కోసం చేసిన మూవీ ఇది.

ఈ సినిమా మ్యూజిక్ గురించి..?
96 మూవీలోని మ్యూజిక్ నాకు చాలా బాగా న‌చ్చింది. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య న‌డిచే క‌థ‌కు ఎలాంటి సంగీతం కావాలో అది గోవింద్ వ‌సంత్ ఇస్తాడ‌నే న‌మ్మ‌కంతో అత‌డిని తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ సినిమాలోని పాట‌లు మీకు చాలా రోజులు గుర్తుండిపోతాయి.

రాజ‌మౌళి గారికి ఈ సినిమా గురించి చెపారా..?
ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ గారికి చెప్పాను. ఇలాంటి సినిమా ఎందుకు అంటూ బూతులు తిట్టారు. ఆయ‌న‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. సినిమా అయిపోయిన త‌రువాత కొన్ని సీన్స్ ఆయ‌న‌తో పాటు కీర‌వాణి గారికి చూపెట్టాను. వారు ఆశ్చ‌ర్య‌పోయారు.

42 లిప్ లాక్స్ ఈ క‌థ‌కు అవ‌స‌ర‌మా..?
ఈ సినిమాలో 42 లిప్ లాక్స్ తో పాటు బోలెడ‌న్ని బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. అవ‌న్నీ కావాల‌ని పెట్టిన‌వి కావు.. క‌థ‌కు అవ‌స‌ర‌మై పెట్టాం. క‌మ‌ర్షియ‌ల్ ఆడియెన్స్ ప‌ల్స్ తెలుసు కాబ‌ట్టే అలా పెట్టాను. సినిమా చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

మీ నెక్ట్స్ చిత్రాలు ఏమిటి..?

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. సీక్వెల్ కి స్కోప్ ఉంది. అయితే రాజ‌మౌళి గారు చేస్తారా లేదా అనేది నేను చెప్ప‌లేను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు