హైదరాబాద్ లో ‘లవ్ టుడే’ గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్

హైదరాబాద్ లో ‘లవ్ టుడే’ గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్

Published on Nov 18, 2022 12:06 AM IST


ఇటీవల ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమిళ్ లో రూపొంది సూపర్ డూపర్ హిట్ కొట్టిన మూవీ లవ్ టుడే. హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి తమిళ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ రాగా దీనిని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు.

యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ కి జోడిగా ఇవానా హీరోయిన్ గా నటించారు. సత్యరాజ్ కీలక పాత్ర చేసిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఇక ఈ మూవీ యొక్క తెలుగు ఆడియో రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 18న సాయంత్రం 6 గం. ల నుండి హైదరాబాద్, మాదాపూర్ లోని దస్పల్లా కన్వెన్షన్ సెంటర్ సెకండ్ ఫ్లోర్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. కాగా ఈ మూవీ యొక్క తెలుగు రిలీజ్ డేట్ త్వరలో వెల్లడి కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు