మళ్ళీ ఎంట్రీ ఇస్తోన్న లవర్ బాయ్ !

Published on Mar 22, 2021 12:00 pm IST

లవర్ బాయ్ ‘తరుణ్’ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు. నువ్వేకావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, నువ్వులేక నెనులేను వంటి సూపర్ హిట్ లవ్ స్టోరీస్ చిత్రాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతున్నాడు. తరుణ్ స్నేహితుడు చెప్పిన ఒక న్యూ ఏజ్ లవ్ స్టొరీతో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతోంది.

ఈ సినిమాలో తరుణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. త్వరలో స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాలో నటించబోయే నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమా ద్వారా తరుణ్ తన స్నేహితుడిని దర్శకుడిగా పరిచయం చేస్తుండడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉండనుంది

సంబంధిత సమాచారం :