ఇంటర్వ్యూ : ‘లవర్స్ డే’ నిర్మాతలు గురురాజ్,వినోద్ రెడ్డి – అల్లు అర్జున్ రావడం సినిమా కి చాలా హెల్ప్ అయ్యింది !

Published on Feb 9, 2019 3:57 pm IST


మలయాళ యువ హీరోయిన్ ప్రియా ప్రకాష్ నటించినతాజా చిత్రం ఒరు ఆధార్ లవ్ ను తెలుగులో లవర్స్ డే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు గురురాజ్ , వినోద్ రెడ్డి. ఈచిత్రం ఈనెల 14న విడుదలవుతున్న సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ?

సినిమా మీద వున్న ఇష్టం తోనే గట్టి పోటీ మధ్య భారీ ధర పెట్టి ఈసినిమా నుకొనడం జరిగింది. అందురు కొత్త వారితో తీసిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. ప్రియా ప్రకాష్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ వుంది.

సినిమా ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లున్నారు ?

సినిమా రెడీ అయిపొయింది ఫస్ట్ కాపీ చూసుకోండి అని డైరెక్టర్ ఫోన్ చేసినప్పుడు కొంచం భయపడుతూనే వెళ్ళాం. కానీ సినిమా అవుట్ ఫుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. అందుకే ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నాం.

ఈసినిమా కేవలం యూత్ కు మాత్రమేనా ?

లేదండి, చిన్నవారు , పెద్దవారు అందరు కలిసి ఈచిత్రాన్ని చూడచ్చు. 60 సంవత్సరాల వయసు వారు కూడా ఈ సినిమా ని బాగా ఎంజాయ్ చేస్తారు. వారిని మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లుతుంది. అందరు కొత్తవారైనా చాలా అనుభవం వున్నవారిలా నటించారు.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎమోషనల్ అయ్యినట్లున్నారు ?

అల్లు అర్జున్ గారంటే నాకు చాలా ఇష్టం ఆయన నా సినిమా ఈవెంట్ కు రావడంతో ఆరోజు చాలా సంతోషం తో కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఆయనకు మాళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బన్నీ రావడం సినిమా ప్రమోషన్స్ కు చాలా హెల్ప్ అయ్యింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది ?

చాలా బాగా జరిగింది. ఒక్కొక్క ఏరియా నుండి 10 నుండి 15 మంది వచ్చారు సినిమా కొనుక్కోవడానికి అలాగే కొన్ని రికమెండేషన్లు కూడా వచ్చాయి. బిజినెస్ పరంగా ఎలాంటి సమ్యస లేదు.

సంబంధిత సమాచారం :