‘అంతక ముందు ఆ తరువాత’ ఫేం సుమంత్ అశ్విన్, ‘ప్రేమ కథాచిత్రమ్’ ఫేం నందిత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవర్స్’. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా ఆగష్టు15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లో బడ్జెట్ లో సినిమాలు తీసి హిట్స్ అందుకున్న డైరెక్టర్ మారుతి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించిన ఈ సినిమా ద్వారా హరినాథ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.
నందితతో పాటు ఈ సినిమాలో షామిలి, తేజస్వి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి చేసే ఎంటర్టైన్మెంట్, మారుతి డైలాగ్స్, జెబి మ్యూజిక్ హైలైట్ అవుతాయని ఇప్పటికే ఈ సినిమా చూసిన కొంతమంది ప్రముఖులు అంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నైజాంలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ – మహేంద్ర బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.


