తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డిసి’ ఈ శుక్రవారం తమిళం, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. తెలుగు యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహించకుండానే ఈ సినిమాను థియేటర్లలోకి తెస్తుండటం గమనార్హం.
లోకేష్ నెక్స్ట్ చిత్రం అల్లు అర్జున్‌తో ఉన్నందున, బన్నీ చేత ఒక పోస్ట్ వేయించినా లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినా మంచి బజ్ వచ్చేది. కానీ చిత్రబృందం ప్రమోషన్లపై అసలు దృష్టి పెట్టకపోవడం అభిమానులను నిరాశపరిచింది.
మరోవైపు తెలుగులో వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో పాటు ఇతర చిత్రాలు భారీగా ప్రచారం చేసుకుంటుండటంతో ‘డిసి’ రిలీజ్ ప్రేక్షకులను ఏమేర థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. అసలు ప్రచారమే లేకుండా రావడం చిత్రబృందం యొక్క ఓవర్ కాన్ఫిడెన్సా లేక లో-ప్రొఫైల్ వ్యూహమా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


