50కోట్ల క్లబ్ లో చేరిన సూపర్ స్టార్ సినిమా !

50కోట్ల క్లబ్ లో చేరిన సూపర్ స్టార్ సినిమా !

Published on Apr 1, 2019 12:07 PM IST

mohanlal2
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘లూసిఫెర్’ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. గత గురువారం విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా మలయాళం లో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ఈచిత్రం.

మాలీవుడ్ సెన్సేషనల్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఈ పొలిటికల్ఎంటర్టైనెర్ లో వివేక్ ఒబెరాయ్ , మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇటీవల ఒడియన్ తో ప్లాప్ ను ఖాతాలో వేసుకున్న మోహన్ లాల్ మళ్ళీ ఈ లూసిఫెర్ తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు