‘డియర్ కామ్రేడ్’ లో కొత్తవారికి అవకాశం !
Published on Jun 14, 2018 12:01 am IST

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ , రష్మిక మండన్న జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’ . ఈ చిత్రంలో ని కొన్ని పాత్రల కోసం కొత్త వారిని వెతికే పనిలో వుంది ఈ చిత్ర యూనిట్.దానిలో భాగంగా ఈ నెల 16 , 17 న కాకినాడలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. నటన ఫై ఆసక్తి వున్నవారికోసం చక్కని అవకాశం కల్పించారు ఈ చిత్ర నిర్మాతలు. కాకినాడలోని మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న గాంధీ భవన్ లో ఈ ఆడిషన్స్ జరుగనున్నాయి .

ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మండన్న క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook