ఇంటర్వ్యూ : లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ – పెద్ది ‘రై రై రా రా’ సాంగ్ కొన్ని తరాలపాటు గుర్తుండిపోతుంది.!

ఇంటర్వ్యూ : లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ – పెద్ది ‘రై రై రా రా’ సాంగ్ కొన్ని తరాలపాటు గుర్తుండిపోతుంది.!

Published on Mar 4, 2026 9:00 PM IST

Untitled 8

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లే ‘పెద్ది’ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్‌, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్ వైరల్ హిట్ గా అదరగొట్టింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఈ సాంగ్ విశేషాలు పంచుకున్నారు లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్.

పెద్ది ‘రై రై రా రా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది?

రామ్ చరణ్ గారి రుద్రతాండవం, ఏఆర్ రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలు గారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, వీటన్నిటి మధ్యలో నుంచి కూడా పాటలో లిరిక్స్ బాగున్నాయి. ఫలానా లైన్ విను, ఫలానా లైన్ బాగుంది అని అన్ని చోట్ల సాహిత్యానికి ప్రశంసలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఈ పాట విన్న తర్వాత చరణ్ గారి రియాక్షన్ ఏంటి?

సాంగ్ విషయంలో పూర్తి స్వేఛ్చ ఇచ్చారు. షూటింగ్ లోకేషన్ లో ఈ పాటను చరణ్ గారికి వినిపించాను. పాట విని నన్ను హత్తుకున్నారు.

ఈ పాట మీకు ఎలాంటి తృప్తిని ఇచ్చింది?

నా పాట విని ఆత్మహత్యను విరమించుకునే సందర్భము రావాలి. అలాంటి పాట రాస్తే నా రచన సార్థకమైనట్లే అని చెప్తుంటాను. ఆ లక్షణం ఈ పాటకి కనిపిస్తోంది.

ఇందులో మీరు రాసిన పాటలు ఇంకా ఉన్నాయా?

మూడు పాటలు రాబోతున్నా యి. బాలాజీ గారు రాసిన చికిరి, ఈపాట ఎంత వైవిధ్యంగా వున్నాయో.. మిగతా పాటలు కూడా దేనికవే ప్రత్యేకంగా వుంటాయి.

ప్రొడక్షన్స్ సపోర్టు గురించి?

ఒక నిర్మాతగా సతీష్ గారు తన బాధ్యతని 100% స్వచ్ఛంగా నిర్వర్తించారు. అందుకే ఇంత మంచి ఫలితం వచ్చింది.

ప్రస్తుతం రాస్తున్న పాటలు?

స్పిరిట్, చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో రాస్తున్నాను. చాలా మంచి పాటలు వుంటాయి

తాజా వార్తలు