మెగా హీరో నుండి లిరికల్ వీడియో సాంగ్.

Published on Feb 28, 2020 10:30 pm IST

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రానుంది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక రోల్ చేస్తున్నారు.

ఈ చిత్రం నుండి నీ కన్ను ‘నీలి సముద్రం… అనే లిరికల్ వీడియో మార్చ్ 2న సాయంత్ర 4:05 నిమిషాలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేశారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మ్యూజిక్ పై భారీ అంచనాలున్నాయి.ఉప్పెన చిత్రం ఏప్రిల్ 2న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :