సమీక్ష : యమ్6 – గందరగోళం వర్సెస్ అయోమయం

సమీక్ష : యమ్6 – గందరగోళం వర్సెస్ అయోమయం

Published on Feb 9, 2019 2:17 AM IST
M6 movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

నటీనటులు : ధ్రువ, అశ్విని

దర్శకత్వం : జైరామ్

నిర్మాత : విశ్వనాధ్ తన్నేరు

ధ్రువ, అశ్విని జంటగా జైరాం వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన చిత్రం ‘యమ్‌6’. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

నిఖిల్ (ధ్రువ) నేహా (అశ్విని) ఒకర్ని ఒకరు సిన్సియర్ గా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో నేహా కజిన్ ఓ పార్టీ ప్లాన్ చేస్తారు. ఆ పార్టీ యమ్ 6 అనే బిల్డింగ్ లో జరుగుతుంది. అయితే పార్టీ జరిగే టైం కంటే రెండు గంటలు ముందే వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు నిఖిల్, నేహా. కానీ నేహా నిఖిల్ కంటే ముందే బిల్డింగ్ లోకి వస్తోంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిమాణాల అనంతరం నేహాని ఎవరో హత్య చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తారు. అసలు నేహాని హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికీ ఉంది ? నేహాని నిఖిల్ కాపాడుకోగలిగడా ? లేదా ? చివరకి నేహా చనిపోయిందా ? లేక బతికే ఉందా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.

 

ప్లస్ పాయింట్స్ :

హీరోగా మొదటి సినిమా చేస్తోన్న ధ్రువ లుక్స్ పరంగా హీరో మెటీరియల్ కాకపోయినా.. తన యాక్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా హీరోయిన్ ని కాపాడే సన్నివేశాల్లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని ధ్రువ బాగానే నటించాడు. హీరోయిన్ అశ్విని తన గ్లామర్ తో ఆకట్టుకోలేకపోయినా.. తన నటనతో మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు సీన్ కి అనుగుణంగా లేకపోయినా.. ఆమె మాత్రం బాగానే ఎఫెక్ట్స్ పెట్టింది.

అలాగే కథలో మరో కీలక పాత్ర అయిన నేహా కజిన్ పాత్ర చేసిన నటుడు కూడా బాగా నటించాడు. హీరోయిన్ తో పాటు ఇంట్లోకి వచ్చి ఇరుక్కుపోయిన ఇద్దరు యంగ్ కమెడియన్స్ కూడా తమ కామెడీ డైలాగ్ డెలివరీతో నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

హార్రర్ ఎలిమెంట్స్ తో కథను రాసుకున్న దర్శకుడు, ఆ కథకు తగ్గట్లు కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా రాసుకోవడంలో విఫలమైయ్యాడు.
సినిమాలో నవ్వించడానికి బలమైన పాయింట్ కనిపిస్తున్నా, ఆ పాయింట్ ని ఎలివేట్ చేసే క్యారెక్టైజేషన్స్ మాత్రం అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా క్లారిటీగా చూపెడితే బాగుండేది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ తో కూడిన కామెడీ సన్నివేశాలు సరిగ్గా ఎలివేట్ కాలేదు.

పైగా చాలా సన్నివేశాల్లో కనీస లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. వీటికి తోడు ఇంట్రస్ట్ గా సాగని స్క్రీన్ ప్లే, సినిమా పై ఉన్న ఆసక్తిని నీరుగారుస్తోంది.

ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. కొన్ని చోట్ల బాగా నవ్వించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ సన్నివేశాలను వదిలేసి.. అనవసరమైన సీన్స్ తో నవ్వు రాని ట్రాక్స్ తో సినిమాని నడిపాడు.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు జైరామ్‌ వర్మ ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు, రాసుకున్న దాన్ని కూడా తెరకెక్కించలేకపోయారు. సంగీత దర్శకుడు విజయ్‌ బాలాజీ అందించిన మెదటి పాట బాగుంది. అయితే ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశాల అవసరానికి మించి.. అనవసరమైన బిల్డప్ మ్యూజిక్ తో సాగుతుంది. ఇక కెమెరా వర్క్ అస్సలు బాగాలేదు. ఎడిటింగ్ కూడా అస్సలు బాగాలేదు. నిర్మాత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి.

 

తీర్పు :

జైరాం వర్మ దర్శకత్వంలో ధ్రువ, అశ్విని జంటగా వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం ఆసక్తికరంగా సాగకపోగా ఆసాంతం విసుగు తెప్పిస్తోంది.

దర్శకుడు జైరామ్‌ వర్మ ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు, పైగా రాసుకున్న దాన్ని కూడా కనీస ఆసక్తి ఉండేలా కూడా తెరకెక్కించలేకపోయారు. మొత్తానికి సినిమా అస్సలు లాజిక్స్ లేకుండా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. మరి ఇలాంటి చిత్రాన్ని చూడక పోవడమే మంచింది.

 

123telugu.com Rating : 1/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు