“మా” ఎన్నికలకు ముహూర్తం ఖరారు!

Published on Aug 25, 2021 6:16 pm IST


సినీ పరిశ్రమ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 10 వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. 2021 నుండి 2023 వరకు పదవి కాలం ఉండనుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మా అధ్యక్ష పదవి కోసం ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన క్రమ శిక్షణ కమిటీ ఈ ఎన్నికల నిర్వహణ పై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం చాలామంది పేర్లు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సారి ఎవరు గెలుస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్ తీవ్రత ఉన్న నేపథ్యం లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం :