స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ చిత్రం, బలమైన మౌత్ టాక్‌తో మొదటి రోజు కంటే శని, ఆదివారాల్లో మరింత భారీ కలెక్షన్లను సాధించింది.
తెలుగు సినిమాల్లో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి లభించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలుస్తూ, సమంత బాక్సాఫీస్ సూపర్ స్టార్ అని మరోసారి నిరూపించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు.
సమంత సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వీకెండ్‌లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ కావడంతో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.


