బుక్‌ మైషోలో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’

బుక్‌ మైషోలో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’

Published on Jun 28, 2026 10:29 AM IST

సమంత హీరోయిన్‌గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పటికే రెండో వారంలోకి ప్రవేశించగా, వసూళ్లు రూ. 75 కోట్ల మైలురాయిని దాటి బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా అద్భుత విజయంగా నిలిచింది. శుక్రవారం కంటే శనివారమే ఈ చిత్రం అధిక వసూళ్లు సాధించింది. ఈ రోజు ఆదివారం కాబట్టీ, వసూళ్లు ఇంకా బలంగా ఉండే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే బుక్‌మైషో టికెట్ అమ్మకాలు మాత్రమే 124వేలు దాటి, ముందు రోజు సంఖ్యలను అధిగమించాయి.

కాగా సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. మొదట ఆయన ప్రేక్షకులను అడగ్గా, ఆడియన్స్ నుండి వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి పార్ట్-2ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ​ఇప్పటికే తన మైండ్‌లో ఒక ఐడియా ఉందని, సేమ్ టీమ్‌తోనే ఈ సీక్వెల్ ఉంటుందని రాజ్ తెలిపారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్‌స్పిరేషన్ తనకు కలగడం ఇదే తొలిసారి అని, రాబోయే చిత్రం డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తాజా వార్తలు