కీలక అనౌన్సమెంట్ ఇచ్చిన “మా” ప్రెసిడెంట్ విష్ణు.!

Published on Nov 27, 2021 6:10 pm IST

గత కొన్ని వారాల కితమే కొన్ని రసవత్తర పరిస్థితులు నడుమ “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)” ప్రెసిడెంట్ గా ప్రముఖ నటుడు మంచు వారి హీరో మంచు విష్ణు ఎన్నిక అయ్యి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అయితే విష్ణు ఎన్నిక అయ్యిన తర్వాత కంటే ముందే ఒకవేళ తాను గెలిస్తే తన మా సభ్యులు సినీ కార్మికులు అందరికీ కూడా మేలు చేసే విధంగా పని చేస్తానని హామీ ఇచ్చాడు.

అలానే ఇపుడు ఓ కీలక అనౌన్సమెంట్ తన మా కుటుంబం కోసం చెయ్యడం జరిగింది. కొన్ని ప్రముఖ హాస్పిటల్స్ తో తమ “మా” టై అప్ అయ్యిందని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని. ఈ టై అప్ అయ్యిన హాస్పిటల్స్ లో ‘మా’ సభ్యులకి అనేక సదుపాయాలు సౌకర్యాలు కలగనున్నాయని. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపాడు.

అలాగే డా.నాగేశ్వర రెడ్డి (ఏఐజీ), డా.భాస్కర్ రావు (కిమ్స్), శ్రీమతి. సంగీత (అపోలో), డా.సుబ్రమణ్యం(సి ఈ ఓ ,అపోలో), డాక్టర్ గురవ రెడ్డి (సూర్యకాంతి) మరియు డాక్టర్ అనిల్ కృష్ణ అలాగే అడిగిన వెంటనే 50 శాతం డిస్కౌంట్ ఇచ్చిన టెనెట్ డయాగ్నోస్టిక్స్ వారి సురేష్ మరియు శ్రీ చరణ్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని విష్ణు తెలిపాడు.

సంబంధిత సమాచారం :