‘మారి 2’ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు !

‘మారి 2’ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు !

Published on Oct 30, 2018 8:05 PM IST

Maari 2

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి 2’ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను నవంబర్ 2న విడదల చేయనున్నారు. బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా వస్తుంది. ఈచిత్రంలో ధనుష్ సరసన ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

యువన్ శంకర్ రాజా ఈచిత్రానికి సంగీతం అందిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ,విద్య , రోబో శంకర్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి. ఇక ఇంతకుముందు మారి తెలుగులో ‘మాస్’ పేరుతో విడుదల కావడంతో ఈ చిత్రం కూడా తమిళ్తో పాటు తెలుగులోనూ విడుదలకానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు