‘యు/ఏ’ సొంతం చేసుకున్న నీలకంఠ ‘మాయ’

‘యు/ఏ’ సొంతం చేసుకున్న నీలకంఠ ‘మాయ’

Published on Jul 30, 2014 8:22 PM IST

Maaya_Movie

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో త్వరలో మన ముందుకు రానున్న సినిమా ‘మాయ’. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆగష్టు 01న సినిమా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది.

ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కాన్సెప్ట్ ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఒక మనిషి జరగబోయే దాన్ని ముందే తెలుసుకోగలిగితే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథాంశం. హర్ష వర్ధన్ రాణే హీరోగా కనిపించనున్న ఈ సినిమాలో అవంతిక, సుష్మ, నందిని రాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మధుర శ్రీధర్ సమరపనలో ఎంవికె రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. గత కొంత కాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నీలకంఠ ఈ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వస్తానని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు